SRCL: భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధిపై ఆలయ ఆవరణలోని ఛైర్మెన్ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ విప్ ఆదివారం మాట్లాడారు.