‘బలగం’ దర్శకుడు వేణు యేల్దండి ‘ఎల్లమ్మ’ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో పాత్ర కోసం ఇప్పటికే నితిన్, నాని, శర్వానంద్ పేర్లు వినిపించగా.. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపిస్తుంది. ఈ మేరకు శ్రీనివాస్‌తో వేణు కథ గురించి చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.