NLR: కావలి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం పలు ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న కావలి ఎంఈవో గోవిందయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలల నుంచి విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించారు. నిబంధనలను ఉల్లంఘించి ఆదివారం తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.