TG: రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దామోదర్ రెడ్డి సంతాపసభలో ఆయన మాట్లాడుతూ.. ‘దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ఖర్గే, రాహుల్, సోనియా హామీ ఇచ్చారు. నల్లగొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే. SRSPకి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతాం. SRSP-2కి RDR అని నామకరణం చేస్తాం’ అని ప్రకటించారు.