TG: మాజీమంత్రి దామోదర్ రెడ్డి సంతాపసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దామన్న నిలబెట్టారు. ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి SRSP ప్రాజెక్టును తీసుకొచ్చారు. వేల ఎకరాలను నల్గొండ ప్రజల కోసం త్యాగం చేశారు’ అని పేర్కొన్నారు.