ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై మెగా హీరో సాయి దుర్గా తేజ్ మాట్లాడారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న సాయికి బన్నీపై ప్రశ్న ఎదురుకాగా.. అల్లు అర్జున్ సూపర్ అంటూ బదులిచ్చారు. ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారని, ఇప్పుడు ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరని అన్నారు. బన్నీ విషయంలో తాను చాలా హ్యాపీగా, గర్వంగా కూడా ఫీలవుతున్నట్లు చెప్పారు.