ASF: దహెగాం మండలంలోని కొత్మీర్ గ్రామపంచాయతీ జెండగూడ గ్రామంలో ఆదివారం నక్క రోజా – శ్రీకాంత్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటికి MLA హరీష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వానాకాలం ముగిసినందున వెంటనే ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు. విడతలవారి అర్హులైన వాళ్లందరికీ ప్రభుత్వ ఇండ్లు మంజూరు చేస్తామని తెలియజేశారు.