TG: జనగామ సబ్ జైలులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల ఘర్షణ కేసులో రిమాండ్లో ఉన్న మల్లయ్య అనే ఖైదీ.. జైలు ఆవరణలో బ్లీచింగ్ పౌడర్ తిని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సింగరాజుపల్లి గ్రామస్తుడిగా పోలీసులు గుర్తించారు. దీంతో జైలు అధికారులు వేధించారని.. సబ్ జైలు ఎదుట మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.