MDK: వెల్దుర్తి మండలం దామరంచ అటవీ ప్రాంతంలో బొమ్మ బొరుసు ఆటపై దాడులు చేసినట్లు తూప్రాన్ సీఐ రంగకృష్ణ తెలిపారు. దాడుల్లో ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా, పదిమంది పరారైనట్లు వివరించారు. వీరి వద్ద నుంచి రూ. 3,29,500 నగదు, ఐదు మోటార్ సైకిల్లు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.