KMR: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం బైక్ దొంగతనానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు,సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బైక్ తీసుకెళ్తుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. అనంతరం పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.