NZB :సాలూర మండలం కేంద్రంలోని సాయిబాబా, హనుమాన్ మందిరాల్లో భక్తులు ప్రత్యేక కాకడ హారతి నిర్వహించారు. కార్తీకమాసం ముందు పౌర్ణమి నుంచి కార్తీకమాస తులసి పౌర్ణమి నెలరోజుల పాటు కాకడ హారతి కార్యక్రమం ఉంటుందని భక్తులు తెలిపారు. ప్రాంతాల్లో దీపావళి అమావాస్య నుంచి అమావాస్య వరకు చేస్తే.. తాము మాత్రం గత పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.