ATP: ఆత్మకూరు మండలంలో ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ, శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని ఆమె తెలిపారు. తొలి విడతలో 800 మహిళలకు 50% సబ్సిడీతో మిషన్లు అందజేస్తూ నెలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.