CTR: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసేటప్పుడు చెట్లు, కరెంట్ పోల్స్ దగ్గర, బహిరంగ ప్రదేశాలలో నిలబడకూడదన్నారు.