JGL: కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులో ఎస్సారెస్పీ వరద కాలువ వద్ద వృద్ధురాలి మెడలో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగగెలి గంగు దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గంగు మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు.