సత్యసాయి: కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు ఉదయం 6 గంటలకు సాధారణ దర్శనంతో దివ్యసేవలు ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అభిషేక పూజలు నిర్వహించగా, అనంతరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకు భక్తులు స్వామివారి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.