MBNR: మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. 2023లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,128 దరఖాస్తులు రాగా ప్రస్తుతం ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 278 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం వ్యాపారులకు ఫోన్ చేసి టెండర్ వేయమని అడుగుతున్నారు.