SRCL: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఆలయాన్ని మూసివేశారనేది అవాస్తవమని, నిత్యపూజలు ఏకాంతంగా జరుగుతున్నాయని, భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, స్థానిక ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకున్నామని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగానే పని చూస్తామన్నారు.