కరీంనగర్లోని కళాభారతిలో నిర్వహించిన విజయదశమి పురస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిట్బిట్ డాన్స్ అకాడమీ, దేవ కళా బృందం ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన ‘విజయదశమి పురస్కారాల’ను కళాకారులకు ఆయన ప్రదానం చేశారు. కళలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.