సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో నేడు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కదిరి, పెనుకొండ, ధర్మవరం ఆర్డీవో కార్యాలయాలు, మున్సిపాలిటీ, మండల కేంద్రాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుంటూ పరిష్కరిస్తామని, ఫిర్యాదుదారులు ఆధార్ కార్డుతో రావాలన్నారు.