KNR: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేసి యథావిధిగా కొనసాగేలా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ కోరారు. గంగాధర మండల కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో అనిల్ సమావేశమయ్యారు. ప్రభుత్వం నిధులు విడుదల చెయ్యాలన్నారు.