ELR: రహదారిపై భారీ గోతులతో భీమడోలు – ద్వారకా తిరుమల రహదారి ప్రాణ సంకటంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. భీమడోలు రైల్వే గేటు నుంచి ద్వారకా తిరుమలకు వెళ్లే సమయంలో మార్కెట్, అమెరికన్ హాస్పటల్, దేవి హాస్పటల్, జంక్షన్ కూడలి, పొలసానిపల్లి, అదేవిధంగా గురుకులం ఎదురుగా భారీగోతులు చెరువులను తలపిస్తున్నాయి. రహదారి మరమ్మతులు చెయ్యాలని ప్రయాణికులు కోరుతున్నారు.