SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఆలయ ఈవో తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఆలయాన్ని ఆగం చేస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ గందరగోళం వలన ఆలయ ప్రతిష్ట దెబ్బతింటే సహించేది లేదని, రాజన్న దర్శనాలు ఆపితే ఊరుకోమని బీజేపీ నాయకులు హెచ్చరించారు.