VZM: విజయనగరం నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ, మండల పార్టీ నూతన కమిటీలను ప్రకటించారు. పట్టణ, మండల పార్టీ అధ్యక్షులుగా గంటా రవి, గంటా పోలినాయుడు, ప్రధాన కార్యదర్శులుగా పీతల కోదండరామ్, పాశి అప్పలనాయుడును నియమించారు.