BDK: ఉపరితల గనుల పరిసర ప్రాంతాల యువకులు, భూ నిర్వాసితులు, మాజీ ఉద్యోగుల పిల్లలు, ఓసీ విస్తరణ ప్రభావిత గ్రామాల యువకులకు ఉద్యోగ శిక్షణ అందిస్తామని ఇల్లందు ఏరియా జీఎం వి. కృష్ణయ్య తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక యువతకు హెవీ మోటార్ డ్రైవింగ్ (వోల్వో, డంప్ ట్రక్ ఆపరేటర్) శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు.