E.G: గోకవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కారాసు శివప్రసాద్ తణుకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. తణుకు ఎమ్మెల్యే అరుమెల్లి రాధాకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పాల్గొని శివప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు.