TG: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుపై ‘మా’ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ శివబాలాజీ స్పందించారు. ఘటనపై క్రమశిక్షణ కమిటీలో చర్చించి.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, మహాత్మాగాంధీపై సోషల్ మీడియాలో.. ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతున్నాడని నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై బల్మూరి వెంకట్ ‘మా’కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.