SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులుగా సేవలు అందిస్తున్న ఎంపీటీసీలకు,ఎంపీపీలకు జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్ తెలిపారు.ఆదివారం నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. 2023 అక్టోబర్ నుండి నేటి వరకు వేతనాలు అందలేదన్నారు. ఎంపీటీసీలకు నెలకు 3 వేలు, ఎంపీపీలకు 6 వేలు ఇవ్వటం జరుగుతుందని అవి జమ కాలేదన్నారు.