NTR: రెడ్డిగూడెంలో ఆదివారం స్థానిక నాయకులు ప్రధాన రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారని, దీనిని గుర్తించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహాయంతో మరమ్మతులు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.