PDPL: జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కల్యాణ మండపంలో ఆదివారం పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తన ఓటు వేశారు. క్లబ్ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగిందని పేర్కొన్నారు.