HYD: ప్రజల మన్ననలు పొందే పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించడానికి త్వరలో ‘ఎక్స్ట్రా మైల్ రివార్డ్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని HYD సీపీ సజ్జనార్ అన్నారు. ప్రతి శనివారం ఉత్తమ సిబ్బందిని గుర్తించి ప్రశంసాపత్రం, రివార్డుతో ఘనంగా సన్మానిస్తామన్నారు. మహిళలు, చిన్నారుల జోలికి వస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.