‘తెలుసు కదా’ సినిమా ప్రమోషన్స్‌లో సిద్ధూ జొన్నలగడ్డ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ విడుదలైన తర్వాత తాను రవితేజపై బయోపిక్ చేయాలనుకున్నట్లు చెప్పారు. అందుకోసం దాదాపు 2 నెలలు పని చేసినట్లు తెలిపారు. మరోవైపు రవితేజ కూడా తాను ఒక నటుడిపై బయోపిక్ చేయాలని అనుకుంటున్నానని, కానీ దాని గురించి ఇప్పుడు వివరాలు చెప్పలేనని పేర్కొన్నారు.