HYD: గాంధీనగర్ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాసనసభ్యులు ముఠా గోపాల్ చేతుల మీదుగా చిన్నపిల్లలకు పల్స్ పోలియో శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎం. రాకేష్ కుమార్, ముఠా నరేష్, పోతుల శ్రీకాంత్, ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.