TG: ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వెంకటగిరిలో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రెండు కళ్లలా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నాం. గత పదేళ్లు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మేం ఇప్పటివరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. అర్హులందరికీ విడతలవారీగా ఇళ్లు మంజూరు చేస్తాం’ అని పేర్కొన్నారు.