AP: మెడికల్ కాలేజీలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.212 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆరాటంతోనే వైసీపీ ఆరోపణలు చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.