మేడ్చల్: దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వినాయకనగర్ వాసి మొహమ్మద్ నబి రసూల్ అన్సారీ అనారోగ్యంతో చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయాన్ని తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి స్పందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ.1,00,000/-విలువైన CMRF ఎల్వోసీని మంజూరు చేయించారు.