KNR: మానకొండూరు మండలం ఊటూరు-పచ్చునూరు గ్రామాలమధ్య రహదారిపై ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో పూర్తిగా ఎండిపోయి, పుచ్చుపట్టిన భారీ వృక్షాలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. గాలి వస్తే ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఏచిన్నగాలివాన వచ్చినా నేల కూలుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించేందుకు జంకుతున్నారు.