NZB: నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ పదవి కోసం ఆర్మూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. కాగా పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. జిల్లా పరిశీలకుడిగా కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.