హైదరాబాద్ నారాయణగూడ తిలక్ నగర్ యూపీహెచ్సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ హరిచందన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. రెండు చుక్కలతో పిల్లల జీవితాన్ని పోలియో నుంచి రక్షించవచ్చన్నారు.