TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెచ్చిన జీవో నెం.9పై హైకోర్టు స్టే విధించడంతో రేవంత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. రేపు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరిని పంపే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.