BDK: ఈనెల 15న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో బి. నాగలక్ష్మి తెలిపారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్’ ప్రధాన అంశంగా, ‘వుమెన్ ఇన్ సైన్స్, డిజిటల్ ఇండియా, స్మార్ట్ అగ్రికల్చర్’ వంటి అంశాలపై ఉపాంశాలు తీసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.