SKLM: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేట మండలం శివనగర్ కాలనీలో 906 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటింటి త్రాగునీరు పథకాన్ని ప్రారంభించారు. దీంతో పాటుగా 50 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన రహదారిని కూడా ప్రారంభించారు. అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.