ADB: జైనథ్ మండల కేంద్రంలోని అతి ప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయం సూర్యోదయం వేళ సూర్య కిరణాలు ఆలయ గర్భగుడిలోని స్వామి పాదాలను తాకాయి. పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని సూర్య దేవాలయంగా కూడా పిలుస్తారు. ఈ దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.