KDP: ఉపాధి కూలీలకు తక్షణమే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఖాజీపేట ఏపీఓ చంద్ర శేఖర్ సూచించారు. ఖాజీపేటలో 13,750 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఇప్పటి వరకు 8,743 మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారన్నారు. చేయకపోతే జాబ్ కార్డు రద్దు అవుతుందన్నారు. ఆదివారం తవ్వారిపల్లెలో పలువురికి ఈ కేవైసీ చేశారు.