MBNR: టీటీడీ దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా ప్రోగ్రాం ఇంఛార్జ్ డాక్టర్ ఉత్తరంపల్లి రామాచార్యులు తెలిపారు. నవంబర్ 25న పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో పోటీలు జరుగుతాయని, 6, 9వ తరగతుల విద్యార్థులకు ఒక విభాగం, 10, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక విభాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.