TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈనెల 22వ తేదీ నుంచి నవంబరు 20వ తేదీ వరకు కార్తీ కమాస పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయం తెరచు వేళలు, సోమవారం రోజున ప్రాతఃకాల అభిషేకాలు, పవళింపు సేవల సమయాలలో మార్పులు చేసినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.