కృష్ణా: గుడ్ మార్నింగ్ మచిలీపట్నం అంటూ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. సమయానికి మంచినీళ్లు వస్తున్నాయా లేదా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.