HYD: మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ‘మా’ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయన శ్రీకాంత్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అతని ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.