ELR: ఈనెల 30, 31వ తేదీల్లో జంగారెడ్డిగూడెంలోని రైతు సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం కైకరం ప్రజాసంఘాల కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లకు ఒకసారి అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా రైతు సంఘం మహాసభలు జరుగుతాయని చెప్పారు.