MHBD: కేసముద్రం మున్సిపాలిటీలోని సబ్ స్టేషన్ తండాలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్లుకు లబ్ధిదారులు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ హాజరై, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఆయన అన్నారు.