BHNG: ప్రతి ఏడాది బతుకమ్మ, నవరాత్రి, దీపావళి పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బంతి సాగు ప్రారంభించే రైతులు, ఈ సారి వరుస వర్షాల కారణంగా నష్టపోతున్నారు. తుర్కపల్లి మండలం పరిదిలో 100 ఎకరాలకు పైగా బంతి సాగు చేశారు. కానీ అధిక వర్షాలతో మొక్కల పెరుగుదల ఆగిపోవడం వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదని రైతులు వాపోతున్నారు.